03 January 2013

మనసు దోచిన లలన... నీకు వందనాలు…

తొలిసంధ్య వెలుగులో మెరిసే పుత్తడిబొమ్మా నీపెరేమిటి ? అన్న నా మొర ఆలకించిన లలనకు ఇదే నా కవితాసుమం...
 
నిన్ను చూడాలని ఆరాటపడే నా మనసును ఆపేదెలా,
నా మదిలోని ఊసులు నీ చెవిలో గుసగుసలాడాలనే ఈ తపన ఎందుకు... కంటిపాప గా మనసులో వున్ననీ రూపం ఎదురవ్వదా తిరిగి ఎప్పటికి… చూసి చూసి నా కనులు అలసిపోయాయి...
 
తూర్పున ఉదయించే కిరణంలా సాగరాన అలుపెరగని కెరటంలా, ఎల్లప్పుడూ నువ్వు నాతోనే వున్నావు అనే భావన.

అనకు ప్రియ ఇది కాదని తరుణం, నా ఈ కవితను చేయకు పరిహాసం...
మౌనం గా నిను ధ్యానిస్తూ...
మనసు దోచిన నీకు వందనాలు… ఎదను కాల్చిన నీకు ఇవే నా నివేదనలు…

10 May 2011

లావణ్యం

                          
బాల్యం లో పరిచయం స్నేహం గా మారక ముందే విడిపోయాయి రెండు మనసులు

ఆ రెండు మనసులు నిజాన్ని విడిచి స్వప్నలోకంలో విహరించాయి,

తేరుకుని చూసేటప్పటికి జీవితాన్నే కోల్పోయాయి,

ఎన్నో వసంతాల తరువాత అనుకోకుండా కలసిన ఆ క్షణం లో

తన పెదవిలో సన్నటి వణుకు ను లీలగా గమనించింది అతని మనసు

తను తిరిగి చేరువవుతుందా అనే ఒక చిన్న ఆశ ఆ మనసులో,

చీకటి లో కూడా వెతుకుతూ ఆ లావణ్యం కోసం...

ఈ నిరీక్షణ ఎన్ని యుగాలైనా కొనసాగుతూనే వుంటుంది...

గతంలోనైనా  లావణ్యం తాలూకు అనుభూతులు మిగులుతాయనే చిన్నిఆశతో...     

03 May 2011

సీమ చింతకాయలు

టివి ప్రపంచం లేని కాలంలో వేసవి వస్తే చాలు, సొంత వూరిలో సెలవల్లో వూళ్ళో వుండే
స్నేహితులతో చేసే సరదా పనుల్లో ఒక ముఖ్యమైన పని బాగా గుర్తు వస్తుంది ఈ రోజు. . .
 
అదే “కొక్కేలు కట్టిన పెద్ద కర్రలు పట్టుకొని సీమచింతకాయల వేటకు బయలుదేరటం”  

ఆ చెట్ల కింద చేరి ఆ కాయలని కోసి వాటిలోని పిక్కలని తినటం అంటే మహా సరదా, మా వూరిలో ఆ చెట్లు స్కూల్ లో నే వుండేవి. . .


పండని దశలో అవి పసరు పసరుగా వున్నా సరే తినటం ఇప్పటి పాతిక వసంతాల వయసున్న కుర్రవాళ్లకు అప్పట్లో బాగా అలవాటే . . .


కాల క్రమంలో ఆ స్నేహలే లెక్కలు కట్టి మాట్లాడే స్థాయికి దిగజారినప్పుడు ఇంకా చెట్లవెంట కాయల వేట సాధ్యమా ?

మరలా ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో ! ! ! కల్మషం లేని స్వార్ధం లేని స్నేహలు . . .

04 October 2010

వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే

తప్పు చేసినప్పుడు లేని బాధ, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ తప్పుని తలుచుకుంటే వస్తుంది... 

నేనా ఇలా చేశానా అని... ఈ క్షణం నా గుండె వేగం నాకు కూడా అందనంత...
ఆగిపోతుందేమో అన్న చిన్న భయం మనసులో..... నేస్తమా నన్ను క్షమించు......

నేను ఎవరినీ బాధ పెట్టాలనుకోను... నా మనస్తత్వం అది కాదు... అందరికీ ఇదే నా చివరి క్షమాపణ...   

వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే” అన్నట్టు వుంది నా మనసు ఇప్పుడు...   
నా జీవితం చీకటయిపోయింది... దాన్ని సరిచేసుకోవటానికి ఆ బాధ నుండి బయట పడటానికి నేను తప్పు చేస్తే అది ఇంకొకరికి శాపంగా మారడం విధి రాత...
నిన్నటి దాకా సరిగమల సప్త స్వరాలుగా సాగిన జీవితంలో హేమంత రాగాల చేమంతులే వాడిపోయాయి, సింధూర వర్ణాలు నల్లని మసి గా మారాయి....
తిరిగి ఆ జీవితం నాకు రావాలి అంటే నా వాళ్ళు నాకు దగ్గర అవ్వాలి... కానీ నేను నా అని నమ్మిన వాళ్లే నువ్వు నువ్వు కాదు అంటూంటే విని తట్టుకోవడం కొంచెం కష్టమే.... అందరూ నన్ను మనస్పూర్తిగా క్షమిస్తారని ఆశీస్తూ... మీ నవీన్  


   

21 September 2010

తరుణోపాయం - ఒక “సత్తా” కి నా సమాధానం

ఈ మహా నగరం లో చాలా ముఖ్యమైన ప్రదేశం హైటెక్ సిటి, ఎటు చూసినా ప్రపంచ పటంలో చాలా చోట్ల కనిపించే పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగులు సమయం నిమిషాల్లో కంటే సెకన్ లలోనే పాటిస్తారు...   అలాంటి చోట నాకు ఒక వ్యాపారం చెద్దాము అనే ఆలోచన వచ్చింది...
ప్రతి రోజు మామూలుగా ఆఫీసు కి వెళితే పట్టే సమయం కె పి హెచ్ బి నుండి హైటెక్ సిటి కి ద్విచక్ర వాహనం పైన 20నిమిషాలు , కార్ లో 30నిమిషాలు. కానీ చిరుజల్లు భూమాతను స్పృశిస్తే అప్పుడు బైక్ పైన 40 నిమిషాల నుండి గంట , కార్ లో గంట నుండి గంటన్నర. ఇక్కడ అసలు సమస్య చెప్పాలి, హైటెక్ సిటి రైల్వే స్టేషన్ దగ్గర చిన్న వంతెన వుంది రైలు వెళ్ళటానికి. దాని కింద నుండి వాహనాలు వెళ్లాలి. అంటే రైలు మార్గం దానికి కింద రోడ్ మార్గము రెండు వున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రయాణ మార్గము కావాలి.
అదే జలమార్గము...  ఎందుకంటే అక్కడ చిరు జల్లుకే ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది, అదే కొద్దిగా తేలికపాటి వర్షానికి చిన్న చెరువులా మారిపోతుంది... ఇటు వెళ్ళటానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు... వారి వాహనాలు పాడవకుండా వారు ఇంకా వేరే మార్గాల్లో వెళ్ళి సమయం వృధా చేసుకోకుండా నాకు ఒక ఆలోచన వచ్చిoది. దానిని ఆచరణ లో పెడితే వారికి నాకు కూడా సమయం ఆదా చేసిన వాడిని  అవుతాను. ఇంకా చాలా మందికి ఒక కొత్త అనుభూతిని మిగిల్చిన వాడిని అవుతాను...
అదే బల్లకట్టు... ఇక్కడ ఒక బల్లకట్టు పెడితే వర్షానికి ఆ దారి చెరువు అయినప్పుడు అక్కడ ఆ బల్లకట్టు సహాయంతో వాహనల్ని అందులోని మనుషులని అవతలి తీరానికి చేర్చవచ్చు... 
మొన్న పొద్దున అటు వస్తూ నేను ఒక పోస్టర్ చూసాను,


ఈ రోడ్ బాగు చెయ్యటా నికి, ముందుకు వచ్చిన  కె పి హెచ్ బి ఎం ల్  ఏ గారికి ధన్యవాదములు అని,  ఐనా ఆ రోడ్ బాగు చేయించిన తరువాత ఆ ధన్యవాదములు చెప్పాలి కానీ సమస్యని చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా  ధన్యవాదములు చెపుతారా?  


ఆ ఎం ల్  ఏ గారికి ఇన్ని రోజులు ఇటు తిరిగి చూడాలని అనిపించలేదా?   


వర్షానికి ఆతలాకుతలం అవుతుంటే పట్టని వారికి ఈ వర్షాకాలం ఇంకో నెలలో అయిపోతుంటే ఇప్పుడు ఇంత శ్రద్ద ఏమిటో!!!